జాతకం, జాతకచక్రం లేదా జన్మకుండలి అంటే ఏమిటి? ఒక వ్యక్తి రాశి, నక్షత్రం ఏమిటో ఎలా తెలుసుకోవాలి.
అత్యావశ్యమైనదిగా చెప్పబడింది. జ్యోతిషమనే మహాసముద్రములో జాతకము ఒక నీటి బిందువులాంటిది. అటువంటి జాతకచక్రము వేయటానికి ముందు మన రాశి, నక్షత్రములను తెలుసుకోవటం ఎలాగో నేర్చుకుందాము. ఈ జ్యోతిషపాఠాలు క్రమం తప్పకుండా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒక పాఠం చదవకపోయినా ఎంతో సమాచారాన్ని కోల్పోయినవారవుతారు.జన్మ రాశి - నక్షత్రం తెలుసుకునే విధానంమన రాశి, నక్షత్రం తెలుసుకోవాలంటే మనం పుట్టిన సంవత్సరానికి గణించబడ్డ దృగ్గణిత పంచాంగం మన వద్ద ఉండాలి. (మీరు జాతక సంబంధ ఏ గణితం చేసినా దృగ్గణిత పంచాగములతోనే చేయండి). ఆ పంచాంగములో ప్రతి రోజు తిథి, వార, నక్షత్ర, యోగ మరియు కరణాల అంత్యసమయాలు ఇవ్వబడతాయి. మీకు ప్రస్తుతం చంద్రస్థితి తెలిస్తే సరిపోతుంది. మీరు పుట్టిన రోజున చంద్రుడు ఏ రాశిలో ఉంటే అదే మీ జన్మరాశి అవుతుంది. ఉదా: తేది 26-03-2004 రోజున మధ్యాహ్నం 2 గంటలకు ఒకరు జన్మించారనుకోండి. ఆ రోజు (బుట్టె ) పంచాంగములో ఉదయం 06:58 వరకు కృత్తికా నక్షత్రం ఉన్నది. అంటే ఉదయం 06:58 నుంచి రోహిణి నక్షత్రం ఆరంభమవుతున్నది. అంటే చంద్రుడు ఆ రోజు రోహిణీ నక్షత్రంలో, వృషభ రాశిలో సంచరిస్తున్నాడని అర్థం. ఈ రోహిణీ నక్షత్రం తెల్లవారి ఉదయం 10:01 ని. వరకు ఉన్నది. అంటే 26-03-2004 ఉదయం 06:58 నుంచి తెల్లవారి(27-03-2004) ఉదయం 10:01 మధ్యలో ఎవరు జన్మించినా వారి నక్షత్రం రోహిణి అవుతుంది. చంద్రుడు సంచరిస్తున్న రోహిణి నక్షత్రం వృషభరాశిలో ఉంటుంది. కనుక ఈ రోజు ఎవరు జన్మించినా వారిది రోహిణీనక్షత్రం, వృషభరాశి అవుతుంది.మీరు జన్మించిన సంవత్సర పంచాంగంలో, మీరు పుట్టిన తేదీకి ఏ రాశి, నక్షత్రాలున్నాయో చూడండి.
ఈ క్రింద ఇవ్వబడ్డ తేదీలకు రాశి, నక్షత్రాలు ఏవి వస్తాయో గణించి కామెంట్స్ ద్వారా కానీ, ఈ- మెయిల్ ద్వారా కానీ నాకు తెలియజేయండి.1. 11-10-1967, 10:10, హైదరాబాద్, 2. 24-04-1973, 06:00, ముంబై, 3. 10-08-2003, 12:00, విజయవాడ.తర్వాతి పాఠములో నక్షత్రపాదం తెలుసుకోవటం, జన్మనామం తెలుసుకోవటం ఎలాగో నేర్చుకుందాం. మీకు ఈ జ్యోతిష పాఠాలకు సంబంధించి ఏవైనా సందేహాలున్నా, సలహాలు, సూచనలు ఇవ్వదలచినా నాకు ఈ-మెయిల్ చేయవచ్చు.
మీ యొక్క జాతక సమస్యలు సరైన పరిష్కారం చెప్పబడును
మీ యొక్క
పుట్టిన తేది
పుట్టిన సమయం
పుట్టిన ఊరు
Comments
Post a Comment