గ్రహాల పరిచయం
గ్రహముల నక్షత్రములు, దశా సంవత్సరములు, మిత్ర, శతృ మరియు సములు రాశుల తర్వాత గ్రహాల గురించి తెలుసుకుందాము. భారతీయ జ్యోతిష శాస్త్రం తొమ్మిది గ్రహాలని జాతక విశ్లేషణ కొరకు ఉపయోగించింది. 1. సూర్యుడు 2. చంద్రుడు 3. కుజుడు 4. బుధుడు 5. గురువు 6. శుక్రుడు 7. శని 8. రాహువు 9. కేతువు ఆధునిక జ్యోతిష్కులు మరో మూడు గ్రహాల్ని గుర్తించారు, అవి. 1. యురేనస్ 2. నెప్ట్యూన్ 3. ప్లూటో రవి సింహరాశికి అధిపతి. చంద్రుడు కర్కాటకరాశికి, బుధుడు మిథున, కన్యలకు, కుజుడు మేష, వృశ్చికాలకు, శుక్రుడు వృషభ, తులలకు, గురువు ధనుర్మీనాలకు, శని మకర, కుంభాలకు అధిపతి. రాహు,కేతువులు ఛాయాగ్రహాలవటం మూలాన వీటికి ప్రత్యేక గృహాలు లేవు. ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి ఫలాల్ని, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ ఫలాల్ని వీరు ఇస్తారు. పరాశరుడు 27 నక్షత్రాలకు ఈ తొమ్మిది గ్రహాల్ని అధిపతులుగా చెప్తూ వాటికి సంబంధించిన దశాసంవత్సరాల్ని ఈ విధంగా కేటాయించాడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు కేతువు అధిపతి. ఈ నక్షత్రాల్లో ఎవరు జన్మించినా వారి జన్మదశ కేతుమహర్దశ అవుతుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలకు శుక్రుడు అధిపతి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలకు ...