పారిభాషిక పదాలు
జ్యోతిషం నేర్చుకునేవారు తెలుసుకోవాల్సిన పారిభాషికపదాలు.
హ్రస్వ, దీర్ఘ రాశులు: హ్రస్వరాశులు :: మేష, వృషభ, కుంభములు సమ రాశులు :: మకర, మిథున, ధనుర్మీన, కర్కాటములు దీర్ఘరాశులు :: వృశ్చిక, కన్యా, సింహ, తులలుపృష్టోదయ, శీర్షోదయ రాశులు: పృష్టోదయ రాశులు :: వృషభ, కటక, ధను, మేష, మకర రాశులు శీర్షోదయ రాశులు :: మిథున, సింహ, కన్య, తుల, వృశ్చిక, కుంభ రాశులు ఉభయోదయ రాశి :: మీనంభూ, జల రాశులు (ఫల, నిష్ఫల రాశులు): ఫల రాశులు, జల రాశులు :: మీన, వృశ్చిక, కటక, మకర రాశులు అర్ధఫల రాశులు, అర్ధజల రాశులు :: కన్య, మీన, వృషభ రాశులు నిష్ఫల రాశులు, నిర్జల రాశులు :: మేష, ధనూ, తుల, సింహ రాశులుచతుష్పద, ద్విపద, జల రాశులు: మేష, సింహ, వృషభములు, మకర పూర్వార్ధము, ధనుస్సు ఉత్తరార్ధములు చతుష్పద రాశులు. కన్య, మిథున, కుంభ, తుల, ధనూపూర్వార్ధములు(నర) ద్విపద రాశులు. మకరము ఉత్తరార్ధము, మీన, కటక, వృశ్చికములు జలచర రాశులుధాతు, మూల, జీవసంబంధ రాశులు: మేషాది రాశులు క్రమంగా ధాతు, మూల, జీవ ప్రధానమై ఉండును. ధాతు ప్రధానమైనవి :: మేష, కటక, తుల, మకరాలు మూల ప్రధానమైనవి :: వృషభ, సింహ, వృశ్చిక, కుంభరాశులు . జీవ ప్రధానమైనవి :: మిగిలినవి అంటే మిథున, కన్య, ధనుర్మీనాలురాశుల వర్ణములు (రంగులు):మేషం - ఎరుపు, వృషభం - తెలుపు, మిథునం - ఆకుపచ్చ, కర్కాటకం - పాటలవర్ణం, సింహం - చిత్ర వర్ణం (గులాబి), కన్య - నీలము, తుల - స్వర్ణము, వృశ్చికం - ధూమ్ర వర్ణం, ధనుస్సు - పసుపు రంగు, మకరం - పింగళ వర్ణం, కుంభం - బభ్రువర్ణం, మీనం - తెలుపు
Comments
Post a Comment