భావముల పరిచయం - కారకత్వములు
లగ్న కారకత్వములు జాతకాన్ని విశ్లేషించటానికి ప్రధానమైనది లగ్నం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్లు అన్ని భావాల్లోకి లగ్నం ప్రధానమైనది. జాతకునికి సంబంధించిన ఏ అంశాన్ని అయినా లగ్నం, లగ్నాత్తు ఆయా భావాల కలయిక ఆధారంగా లెక్కించటం జరుగుతుంది. లగ్నం, ఇతర భావాలు, గ్రహస్థితులు, దశాభుక్తులు మొదలైన గణిత విభాగాన్ని మీకు ఇక్కడ అందించటం లేదు దీని కొరకు శ్రీ కె.ఎస్. కృష్ణమూర్తి గారి పుస్తకాలు కాని, లేక బి.వి.రామన్ గారి పుస్తకాలు కాని ఇతర ప్రముఖ జ్యోతిష్కుల పుస్తకాలు కాని చదవ వలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పాఠాల ద్వార ప్రధానంగా జాతకవిశ్లేషణకు ప్రాధాన్యత ఇవ్వటం వలన గణిత విభాగాన్ని అందించలేక పోతున్నాను. లగ్నం : ఒక వ్యక్తి జాతకాన్ని విశ్లేషించటానికి ప్రధాన ఆధారం. లగ్నం ఒక వ్యక్తి శారీరక స్థితి ఎలా ఉంటుందో చెపుతుంది. అతని మానసిక స్థితి, ప్రవర్తన, సమాజంతో అతను వ్యవహరించే విధానం , సమాజం పట్ల అతనికున్న దృక్కోణం , అతని అరోగ్య స్థితి, అలోచనా విధానం ఇలా ఒక్కటేమిటి ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని అంశాల ప్రాథమిక అవగాహన ఒక్క లగ్నం ద్వారా నిరూపితమవుతుంది. లగ్న కారకత్వాలు: పరాశరుడు లగ్నం గురించి వివరిస్తూ లగ్...